☼ Suryaa News
🔴 తెలంగాణ భీమేశ్వరుడి హుండీకి భారీ కానుకలు
తెలంగాణ

భీమేశ్వరుడి హుండీకి భారీ కానుకలు

17 Sep 2026 Reporter

- నగదు రూ 3.72 కోట్లు
- 201.4 గ్రాముల బంగారం, 16.6 కిలోల వెండి


సూర్య, వేములవాడ: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి క్షేత్రంలో 28 రోజుల హుండీ ఆదాయాన్ని రెండు రోజులపాటు లెక్కించారు. మొత్తం రూ.3,72,78,809 నగదు, 201.4 గ్రాముల బంగారం, 16.6 కిలోల వెండి లభించినట్లు ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ తెలిపారు.హుండీ లెక్కింపు ఆలయ ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ పరిశీలకుడు రాజమౌళి, డీఈవో నవీన్‌కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బంది, ఔట్‌సోర్సింగ్, ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home