☼ Suryaa News
🔴 తెలంగాణ మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు
తెలంగాణ

మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

18 Sep 2026 Reporter

 

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా వికారాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాత బాల భక్త సమాజం ఆధ్వర్యంలో గణేష్ కట్ట మైసమ్మ గుడి, శివాజీ నగర్‌లోని వినాయక మండపం వద్ద గురువారం రాత్రి దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు టి. సదానంద రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీవాసులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ఆయురారోగ్యాలతో దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్, తెలంగాణ హిందూ జనశక్తి అధ్యక్షులు శ్రీనివాస్, వికారాబాద్ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, ఆధ్యాత్మిక సెల్ కన్వీనర్ ప్రవీణ్, నర్సింలు, భాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వప్న, స్వాతి తదితరులతో పాటు కాలనీవాసులు, పిల్లలు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home