☼ Suryaa News
🔴 తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ
తెలంగాణ

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ

14 Sep 2026 Reporter

 

మంద జగన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం:—:


బీజేపీ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీగా నియమితులైన బందెల సత్యనారాయణను సికింద్రాబాద్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు మంద జగన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంద జగన్ మాట్లాడుతూ బందెల సత్యనారాయణకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలను అందుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చింతకింది మల్లేష్, ఒగ్గు శ్రీధర్, మూల అరవింద్ కుమార్, కొమరయ్య మంద, ఈశ్వర్ మంద, కొండా కిషోర్ గౌడ్, సాయి చరణ్ గంగపుత్ర, చింతకింది సాయి కుమార్, మంద మురళి, గబ్బెట రాజు, చిదురాల శ్రీనివాస్, వైట్ల వెంకటాద్రి, వల్లపు కృష్ణమూర్తి, కర్నాటి ఆనంద్ కుమార్, తిరుమల రవి, తౌఠం సతీష్, దిండిగల శ్రీకాంత్, ఆనందాస్ కరుణాకర్, ఆమంచా రామకృష్ణ, తిరుమల సంతోష్, మంద పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home