☼ Suryaa News
🔴 తెలంగాణ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం
తెలంగాణ

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

19 Sep 2026 Hareesh
 సూర్య తెలంగాణ డెస్క్: భావి భారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, సమాజ నిర్మాణంలో వారి నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని ప్రముఖ వక్తలు కొనియాడారు. బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఎస్ఎంఏటీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం ఆడిటోరియంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మోటివేట్, ఎంపవర్, టీచ్ అనే ఉన్నత సందేశంతో నిర్వహించిన ఈ సదస్సులో నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సృజనాత్మకతను పెంపొందిస్తున్న ఉత్తమ గురువులను సత్కరించారు. ఈ నేపథ్యంలో అల్మాస్‌గూడలోని శ్రీ నవ విద్యార్థి స్కూల్ ఉపాధ్యాయిని అవధూత సాగరిక విశిష్ట సేవలను గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో ఘనంగా సత్కరించడంతో ఆ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశాయి.ఈ ప్రతిష్ఠాత్మక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి డీజీపీ సీవీ ఆనంద్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా భావి తరాలకు ఉన్నత సంస్కారం, నైతిక విలువలను అందించే సాధనంగా నిలవాలని అతిథులు ఉద్ఘాటించారు. దేశ ప్రగతికి బాటలు వేసే విద్యారంగంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించుకోవడం సమాజ బాధ్యత అని వారు స్పష్టం చేశారు.విద్యార్థులను పోటీ ప్రపంచంలో రాణించేలా తీర్చిదిద్దుతూనే వ్యక్తిత్వ వికాసానికి, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తనకు ప్రాధాన్యతనిస్తున్న ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర ప్రశంసనీయమని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. బీఎస్ఎంఏటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జె. మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పి. జలంధర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి జె. శ్రీనివాసరావుల సమక్షంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు జ్ఞాపికలు అందజేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అవధూత సాగరికకు పలువురు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ గుర్తింపు మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
Advertisement
సంబంధిత వార్తలు
తెలంగాణ

డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు

🕑 19 Sep 2026
తెలంగాణ

ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర

🕑 19 Sep 2026
తెలంగాణ

పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్

🕑 19 Sep 2026
తెలంగాణ

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం

🕑 19 Sep 2026
తెలంగాణ

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

🕑 19 Sep 2026
తెలంగాణ

జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ

🕑 19 Sep 2026
Advertisement
↗ Full Article ← Home