నల్గొండ: నల్గొండ పట్టణంలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
న్యూ వెంకటేశ్వర కాలనీ వాసులు, వెంకటరమణ జువెలరీ అధినేత లకుమారపు శ్రీనివాస్–సునీత దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పద్మావతి ఉద్యానవనం (వెంకటేశ్వర కాలనీ పార్కు)లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ రావిరాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి బండారు ప్రసాద్ లకుమారపు శ్రీనివాస్ సునీత శ్రీధర్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా సేవా భావాన్ని చాటుతున్న లకుమారపు శ్రీనివాస్–సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. కార్యక్రమంలో సూది రెడ్డి లింగారెడ్డి, సురిగి కృష్ణయ్య నాగులపల్లి శ్యాంసుందర్, శ్రీపాద కృష్ణమాచారి ,రామచంద్రయ్య, నల్పరాజు నాగార్జున , ముడుంబా జనార్ధనాచార్యులు నూకల జైపాల్ రెడ్డి కొండోజు పుల్లయ్య , నరసింహ, సముద్రాల శ్రీనివాస్, గౌరు గోపాలకృష్ణమూర్తి
భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.