*
*సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం
*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి*
కర్నూలు , సెప్టెంబర్ 19:- ఈ నెల 21వ తేదీన సోమవారం కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు , మునిసిపల్ కార్యాలయాల్లో కూడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
*అర్జీల పరిష్కారం సమాచారం కోసం 1100 కు ఫోన్ చేయవచ్చు*
అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. అలాగే అర్జీదారులు *Meekosam.ap.gov.in*
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.