☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం
ఆంధ్రప్రదేశ్

సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం

19 Sep 2026 kakinadasatish

శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన  పథకానికి రూ.లక్ష విరాళం

అన్నవరం, సెప్టెంబర్ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి కాకినాడ వాస్తవ్యులు ఎస్. సూరిబాబు, శ్రీమతి సుజాత దంపతులు రూ.1,00,000/- విరాళాన్ని అందజేశారు.
ఈ విరాళాన్ని దేవస్థానం సూపరింటెండెంట్ గంటా విష్ణుకు అందజేసిన దాతలు, తమ విరాళంపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన భక్తులకు అన్నదానం నిర్వహించాలని కోరారు. భక్తులకు నిరంతరం అన్నప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో నిత్యాన్నదాన పథకానికి విరాళం అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ గంటా విష్ణు పేర్కొంటూ దాతలను అభినందించారు.
దేవస్థానంలో నిత్యాన్నదాన పథకం ద్వారా ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న నేపథ్యంలో భక్తుల సేవకు దాతలు ముందుకు రావడం పట్ల దేవస్థానం అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు నాగేంద్ర చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, బి.ఎస్.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home