సీతమ్మధార, సెప్టెంబర్ 19, మేజర్ న్యూస్ : జీవీఎంసీ 26వ వార్డులో శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజా మహోత్సవాలను పురస్కరించుకొని, న్యూ ఫ్రెండ్స్ సంపత్ వినాయక యూత్ అసోసియేషన్, ఎం ఎం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్డులోని పలు వినాయక పందిళ్లలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నదానం కార్యక్రమం 26వ వార్డు వైసిపి అధ్యక్షులు బొడ్డేట్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అవినాయకుని ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.