☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

19 Sep 2026 Madhubabu

-రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్ల తనిఖీ

నంద్యాల అర్బన్:

త్రైమాసిక తనిఖీలో భాగంగా నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల భద్రతా ఏర్పాట్లు, సీల్‌లు, రక్షణ చర్యలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న తీరును ఆమె తనిఖీ చేశారు. గోదాముల పరిసరాల్లో చేపడుతున్న భద్రతా చర్యలను కూడా పరిశీలించి, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.nఈ తనిఖీలో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డిఓ విశ్వనాథ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున సయ్యద్ రియాజ్ భాష, తెలుగుదేశం పార్టీ తరపున శివరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయిరాం రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రదీప్, సీపీఐ తరపున నరసింహులు తదితర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home