☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత
ఆంధ్రప్రదేశ్

పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత

19 Sep 2026 Madhubabu

 

నంద్యాల అర్బన్ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) స్ఫూర్తితో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దాతలు ముందుకొచ్చి అండగా నిలవడం అభినందనీయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు . నంద్యాల టౌన్ 19 వార్డ్ పోన్నాపురం గ్రామానికి చెందిన పేద విద్యార్థి ఎడవల్లి వసంత కుమార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, అతని ఆర్థిక పరిస్థితిని గుర్తించి గోస్పాడు మండలం ఎం. కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి రూ. 20,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పీ-4 నంద్యాల నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ వెంకట చెన్నయ్య సమన్వయంతో, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా విద్యార్థి ఎడవల్లి వసంత కుమార్‌కు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు నిరుపేద విద్యార్థులకు ఇలా చేయూతనిచ్చి వారి భవిష్యత్తుకు బాటలు వేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన దాతలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సకాలంలో ఆర్థిక సాయం అందేలా చొరవ చూపిన మంత్రి ఫరూక్ గారికి, దాతలకు, పీ-4 ప్రతినిధులకు విద్యార్థి మరియు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home