☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్..
ఆంధ్రప్రదేశ్

AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్..

19 Sep 2026 vizagsrinivas

 

 

పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఘనంగా రోజ్‌గార్ మేళా..

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్న ఎంపీ శ్రీభరత్..

కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎంపికైన 201 మంది అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత..

విశాఖపట్నం,సెప్టెంబర 19,మేజర న్యూస :        ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఉద్యోగం సాధించడంతో తమ బాధ్యత పూర్తయిందని భావించకుండా ప్రతి ఒక్కరూ నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ సూచించారు. నిరంతర అభ్యాసం, నైపుణ్యాల అభివృద్ధితోనే మారుతున్న ఉద్యోగ ప్రపంచంలో రాణించడంతో పాటు భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోగలరని ఆయన అన్నారు.
విశాఖపట్నంలోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన 20 వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్, సీబీడీటీ, జీఎస్టీ, డిఫెన్స్, ఈపీఎఫ్‌ఓ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన 201 మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతిభావంతులైన అధికారులు, ఉద్యోగులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. 
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే పదవీ విరమణ వరకు స్థిరమైన భద్రత ఉంటుందనే భావన ఉండేదని, అయితే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా AI కారణంగా ఉద్యోగాల స్వరూపంలో కూడా మార్పులు వస్తున్నాయని చెప్పారు.
నిరంతర నైపుణ్యాభివృద్దితో మాత్రమే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుదల సాధ్యమని  ఎంపీ శ్రీభరత్ సూచించారు.
ఉత్తరాంధ్ర, తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది అధికారులు దేశవ్యాప్తంగా వివిధ ఉన్నత హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తుండటం గర్వకారణమని శ్రీభరత్ అన్నారు... కార్యక్రమంలో  కేంద్రప్రభుత్వరంగ సంస్ధల వివిధ శాఖల ఉన్నతాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు..

......

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home