☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ నంద్యాల చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ నంద్యాల’
ఆంధ్రప్రదేశ్

నంద్యాల చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ నంద్యాల’

19 Sep 2026 Madhubabu

స్వయంగా చెత్తను శుభ్రం చేసి శ్రమదానం చేసిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్

నంద్యాల అర్బన్:

నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ నంద్యాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ స్వయంగా చేతికి గ్లౌజులు ధరించి, చీపురు పట్టి చిన్న చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానంలో పాల్గొని ప్రజల్లో స్పూర్తి నింపారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు . పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. చిన్న చెరువు కట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తబుట్టలను మాత్రమే వినియోగించాలని సూచించారు. పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ, వార్డుల వారీగా పారిశుధ్య పనులను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ నంద్యాల ప్రతిజ్ఞ నిర్వహించారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న , స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఇంజనీరింగ్, శానిటరీ విభాగాల అధికారులు, పారిశుధ్య సిబ్బంది మరియు స్థానిక పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home