☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి*
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి*

19 Sep 2026 Kurnooljanakiramaiah

 

*జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి*

*కర్నూలు, సెప్టెంబర్ 19 : జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకొని వారికి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ. సిరి పేర్కొన్నారు.*

*శనివారం కలెక్టరేట్ ఛాంబర్ లో నైపుణ్యం అభివృద్ధి మరియు శిక్షణ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ.సిరిగారు,  ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంటం జ్యోతి  గారు ఆవిష్కరించారు.*

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలో భాగంగా వివిధ రకాలైన 28 ప్రైవేటు కంపెనీలలో ఉన్న 1450 ఖాళీలను భర్తీ నిమిత్తం BJR HIGH SCHOOL , Alur లో September 24వ తేది,  ఉ.9:30 గం.ల నుండి సా.4గం.ల వరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. సదరు జాబ్ మేళా లో పాల్గొనాలనుకునే యువతీ, యువకులు 18 సం.ల నుండి 35 సం.ల లోపు ఉండడంతో పాటు పదవ తరగతి నుండి డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పిజి చదివిన వారు జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. అందుకు గాను ముందుగా Naipunyam.ap.gov.in లింక్ లో సదరు వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.*

*జిల్లా ఉపాధి అధికారిణి దీప్తి  గారు మాట్లాడుతూ జాబ్ మేళాను యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జాబ్ మేళాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్న  నంబర్లకు సంప్రదించగలరని తెలిపారు.*
9603303354,
9346243624

*కార్యక్రమంలో   ఉపాధి కల్పన అధికారి దీప్తి  మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*

*--*

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్..

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు: కలెక్టర్ జి. రాజకుమారి

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రతిభ – స్వర్ణ పతకాలు కైవసం

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

🕑 19 Sep 2026
Advertisement
↗ Full Article ← Home