☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు
ఆంధ్రప్రదేశ్

అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు

19 Sep 2026 Reporter

అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేఫ్ సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇందులో భాగంగా ఎండ వేడిమికి ద్విచక్ర వాహనం అంటుకుందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home