శ్రీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం లోని హెచ్‌బీ కాలనీ డివిజన్ ఫేజ్-1 గ్రౌండ్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 20వ యజ్ఞ మహోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణుల సాంప్రదాయాలు, కళలు, వృత్తి నైపుణ్యాలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నూతలపాటి మల్లికార్జున, చైర్మన్ కేసోజు లక్ష్మీనారాయణ చారి, యజ్ఞ కమిటీ అధ్యక్షులు సద్గుణ చారి, కేసోజు శ్రీనివాస చారి, సమ్మని మురళీ చారి, శ్యాంసుందర్ చారి, సమ్మని సత్యనారాయణ చారి, మునుగంటి రాంప్రదీప్, అమ్మనబోలు శ్రీనివాస చారి, బ్రహ్మచారి, పాండు చారి, శంకర్, వెంకటాద్రి, వాసుచారి, భీష్మ చారి, పవన్ చారి, విష్ణు చారి, మల్లేష్ గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.