☼ Suryaa News
🔴 తెలంగాణ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

18 Sep 2026 medaksurender

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు స్వయంగా చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ
సంగారెడ్డి, : గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సదాశివపేటలోని ఊబ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, నందికంది గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు.శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:15 గంటల సమయంలో సదాశివపేట మండలం నందికంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించి, వారికి అవసరమైన తక్షణ సహాయం అందించారు.
పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో క్షతగాత్రులను పోలీసు వాహనం, అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా ఎస్పీ చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన వారు:
శివలీల, భర్త మల్లేశం, కంది గ్రామం, కంది మండలం.బి. సంతోష్, ఆటో డ్రైవర్, ఉత్తర్పల్లి గ్రామం, కొండాపూర్ మండలం.
ఎన్. అమర్, బీదర్ జిల్లా, బైక్ రైడర్.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
తెలంగాణ

ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర

🕑 19 Sep 2026
తెలంగాణ

పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్

🕑 19 Sep 2026
తెలంగాణ

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం

🕑 19 Sep 2026
తెలంగాణ

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

🕑 19 Sep 2026
తెలంగాణ

జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ

🕑 19 Sep 2026
తెలంగాణ

కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు.

🕑 19 Sep 2026
Advertisement
↗ Full Article ← Home