☼ Suryaa News
🔴 తెలంగాణ ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి
తెలంగాణ

ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి

13 Sep 2026 vasu

నర్సాపూర్ : మెదక్ ఎంపీ రఘునoధన్ రావుని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్  బొజ్జ సూర్యనారాయణ రెడ్డి తెలంగాణలో నాన్ ప్రొఫెషనల్ ప్రైవేటు డిగ్రీ & పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ బకాయిల పెండింగ్ సమస్యల గురించి తెలియచేయడం జరిగింది.  ప్రత్యేకంగా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ &  పీజీ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నాయి.

ప్రభుత్వం ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కళాశాలలను ఒకేవిధంగా చూడవద్దని, డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ ప్రభుత్వం ఇచ్చే 100%  ఫీజు రీయింబర్స్ పైన మాత్రమే ఆధారపడి ఉన్నాము అని తెలియచేయడం జరిగింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ పై అవలంబిస్తున్న అసమానతల గురించి తెలిచేయడం జరిగింది. డిగ్రీ అసోసియేషన్ కి సహకరిస్తాము అని తెలియచేయడం జరిగింది.

ఈ సమావేశములో పాల్గొన్న వారు మాదారం రమేష్ ఐబీపీ, డా.కే.నరేష్, నర్సింహారెడ్డి కేడిజిపి, హన్మంతు యాదవ్ భారతి డీసీ, శ్రీనివాస్ ఐబీపీ, అశోక్ ఎల్లంకి డీసీ   తదితరులు పాల్గొన్నారు. అనంతరం, నిజామాబాద్ ఎంపీ గౌరవ ధర్మపురి అరవింద్ గారిని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్  బొజ్జ సూర్యనారాయణ రెడ్డి  తెలంగాణలో  నాన్ ప్రొఫెషనల్ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలకు గత నాలుగు సంవత్సరాల ఫీజు రీయింబర్స్ బకాయిల పెండింగ్ సమస్యల గురించి తెలియచేయడం జరిగింది.

ప్రత్యేకంగా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ పై అవలంబిస్తున్న అసమానతల గురించి తెలిచేయడం జరిగింది. డిగ్రీ అసోసియేషన్ కి సహకరిస్తాము అని తెలియచేయడం జరిగింది. ఈ సమావేశములో పాల్గొన్న వారు మాదారం రమేష్ ఐబీపీ, డా.కే .నరేష్, నర్సింహారెడ్డి  పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home