రక్తదానానికి యువత ముందుకు రావాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు - డా. పగడాల కాళీ ప్రసాద్ రావు
బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన
గీసుగొండ సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ (సూర్య)రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటానికి యువకులు ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా, బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు,15,16,17 డివిజన్లు గీసుగొండ,సంగెం మండల బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు హాజరైనారు.ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం డా. పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ..
యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని,యువతలో సేవాభావాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి పెసురు విజయ్ చందర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు,డివిజన్ అధ్యక్షులు జాలిగపు ప్రసన్న, రాంప్రసాద్,భోజం విజయ్,ల్యాదల్ల ప్రభాకర్,గీసుగొండ,సంగెం మండల అధ్యక్షులు కొంగర రవి,దామెరుపుల చంద్రమౌళి,స్టేట్ కౌన్సిల్ మెంబర్ గట్టికోపుల రాంబాబు,వరంగల్ జిల్లా కార్యాలయం కార్యదర్శి కంది క్రాంతి కుమార్,జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి బందెల రేణుక,బీజేవైఎం నాయకులు నిఖిల్ రావు, పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, రాచర్ల నరేష్, కందుల రవి వర్మ, బోసు రాజేష్, బట్ట మేకల శ్రీనివాస్, బైకానీ వెంకటేష్, వీరేష్, బొమ్మగాని సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.