కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, త్యాగాలు చిరస్మరణీయం. --ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 21,మేజర్ న్యూస్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి, త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కోన్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, ఆయన సేవలను ఎల్లవేళలా స్మరించుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు చిట్యాల మండల అధ్యక్షులు, పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.