☼ Suryaa News
🔴 తెలంగాణ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు
తెలంగాణ

వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు

18 Sep 2026 karimnagarvenkatesh

 

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొన్న 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న

 సూర్య కరీంనగర్ ప్రతినిధి 
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ 11వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీ రోడ్ నంబర్ 21, 21/4లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక స్వామివారికి ప్రత్యేక కుంకుమ పూజ నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి వెల్లివిరియాలని కోరుకున్నారు.

అదేవిధంగా వినాయక మండపాల నిర్వాహకులు, కాలనీవాసులు ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమజ్జనం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కార్పొరేటర్‌ను మండపానికి ఆహ్వానించిన కాలనీవాసులు, నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మండప నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home