సూర్య నిజామాబాద్:
ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో మృతి చెందిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్. సతీష్ పార్థివదేహానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో సతీష్ పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన స్వస్థలమైన ఇల్లెందు, ఖమ్మం జిల్లాకు తరలించారు.