*మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ*
*రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేసిన అల్లం స్వప్న బాలకిషోర్*
గీసుగొండ సెప్టెంబర్ 19 మేజర్ న్యూస్ (సూర్య)మండలంలోని బాలయ్యపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాగిరి గణేష్,నల్ల సిద్ధార్థ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి,జిల్లా నాయకులు గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి శనివారం బాలయ్యపల్లి గ్రామానికి వెళ్లి మృత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు.మృత విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా రాగిరి గణేష్ తల్లిదండ్రులు లింగమూర్తి,అనిత, అలాగే నల్ల సిద్ధార్థ తల్లిదండ్రులు అశోక్, ఉమా దంపతులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం రాగిరి గణేష్ కుటుంబానికి రూ.10వేలు,నల్ల సిద్ధార్థ కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ మాజీ సర్పంచులు కోల కుమారస్వామి,దౌడు బాబు, మాజీ ఉపసర్పంచ్ పొగాకు బిక్షపతి,గీసుకొండ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్,వార్డు మెంబర్ పసుల యుగేందేర్,గాడిదుల బొంద్యాలు,కందికొండ రాజు,బోయ అశోక్,చాపర్తి రాజమౌళి పాల్గొన్నారు.