సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని టకార బస్తీ లో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ‘అశోక యువజన సంఘం’ మహా గణపతి విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మారావు గౌడ్ నిర్వహించే వినాయక ఉత్సవాలు విభిన్నంగా నిలిచి భక్తులను ఆకట్టుకుంటాయని దిల్ రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభిన్న ఉత్సవాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సంస్కృతికి దర్పణంగా నిలుస్తాయని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. యువ నేత కిశోర్ కుమార్ తదితరులతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.