☼ Suryaa News
🔴 తెలంగాణ శ్రీకృష్ణ వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి గణపతి
తెలంగాణ

శ్రీకృష్ణ వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి గణపతి

19 Sep 2026 medaksurender

శ్రీకృష్ణ వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి గణపతి

 

పటాన్ చెరు : శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సిద్ధి గణపతి స్వామివారు శ్రీకృష్ణ వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో “ఓం గం గణాధిపతయే నమః” మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పట్లోళ్ల లక్ష్మారెడ్డి, కె. సాయి గణేష్, ఎన్. సతీష్ కుమార్, ఎ. మురళి గౌడ్, ఎ. సంతోష్, ఎ. ప్రభు, బి. శివ రాములు, ఎ. రాజేష్ గౌడ్, ఎ. ముకుంద రెడ్డి, సి. నారాయణరెడ్డి, డి. మహేష్, ఎ. కృష్ణ, ఆర్. శ్రీనివాస్, ఎం. రత్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home