☼ Suryaa News
🔴 తెలంగాణ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
తెలంగాణ

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

13 Sep 2026 Reporter

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

డీజే లకు నో.. రాత్రి 10 తర్వాత లౌడ్‌స్పీకర్లు బంద్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

జీనోమ్ వ్యాలీ సీఐ 
గోపగాని గురువయ్య గౌడ్
శామీర్ పేట,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ......
ప్రతి మండపాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, హార్డ్‌కాపీని పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని,
మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి డ్రమ్ములు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మండపాలు, శోభాయాత్రల్లో డీజే లకు పూర్తిగా నిషేధం ఉందని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. మద్యం, జూదం, టపాసులు, అభ్యంతరకర నినాదాలు, ఇతరుల మనోభావాలను కించపరిచే కార్యక్రమాలకు తావులేదన్నారు.
నిమజ్జన శోభాయాత్రను పోలీసుల సూచనల మేరకు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రశాంతమైన గణేష్ ఉత్సవాలకు ప్రజలు, నిర్వాహకుల సహకారం అత్యంత అవసరమని సీఐ గోపగాని గురువయ్య గౌడ్ అన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home