కీసరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రామిడి స్వప్న విజయ్‌రెడ్డి
కీసర, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 21):
కీసర డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కార్యాలయం ఏర్పాటు ద్వారా డివిజన్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కీసర డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని కోరారు.
కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.