వేలంలో దక్కించుకున్న బీజేపీ నేత చెల్లక శ్రీధర్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబర్, 21):
ఘట్కేసర్ బాలాజీనగర్‌లోని రెడ్డి కిరాణా షాప్ వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామివారి మహా లడ్డూకు నిర్వహించిన వేలంలో రూ.55,555 ధర పలికింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్ వేలంలో పాల్గొని ఆ లడ్డూను రూ.55,555కు కైవసం చేసుకున్నారు. వేలం అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీధర్‌ను అభినందించారు. వినాయకుడి కృపాకటాక్షాలు ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.