మదనాపురంలో భక్తిశ్రద్ధలతో గణనాథుని శోభాయాత్ర
మునుగోడు,మేజర్ న్యూస్:
మండలంలోని వెలగలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మదనాపురం కాలనీలో
శ్రీ కౌండిన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. యువత, గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు. శ్రీ కౌండిన్య యూత్ అసోసియేషన్ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేసి శోభాయాత్రను విజయవంతం చేసినందుకు అభినందించారు.
ఈ శోభాయాత్రలో సురిగి రవి, తాందారి లింగస్వామి, సురిగి లింగస్వామి, బక్క భాస్కర్, సురిగి నాగరాజు, ఈదులకంటి సైదులు, బక్క సందీప్, దాము అంజయ్య, బక్క సతీష్, బక్క భరత్‌తో పాటు యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.