గణనాథుని నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం
గణపసముద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన గణపురం సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్
గణపురం, సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ సూర్య: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గణపురం సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్, బుర్రకాయలగూడెం సర్పంచ్ తుమ్మల సంపత్ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. కార్యక్రమంలో బురకాల గూడెం సర్పంచ్ తుమ్మల సంపత్ ఘనపూర్ ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ కలియ సాగర్, మాజీ కోఆప్షన్ సభ్యులు మమ్మద్ చోటేమియా, వార్డు మెంబర్ తిక్క సంపత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోనాల రాజమౌళి, యువజన నాయకులు మచ్చిక రక్షిత్ గౌడ్, బొడిగ శివ గౌడ్, కార్యదర్శి తీగల రాజు తదితరులు పాల్గొన్నారు.