☼ Suryaa News
🔴 తెలంగాణ అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ
తెలంగాణ

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ

18 Sep 2026 nalgondamastan

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ
మిర్యాలగూడ అర్బన్ ,మేజర్ న్యూస్ సెప్టెంబర్ : అమృత్ భారత్ పథకం కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసిన సిగ్నల్ ఫోన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన డీఆర్‌ఎం, వాటిని తక్షణమే మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే గూడ్స్ షెడ్‌లో సౌకర్యాలను మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
నడికుడి–బీబీనగర్ డబుల్ లైన్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదారులకు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో రైల్వే వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home