☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్
ఆంధ్రప్రదేశ్

సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్

19 Sep 2026 vizagsrinivas

 

 

‘నిర్మల్ సాగర్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎంపీ శ్రీభరత్.

సముద్రంలోకి వ్యర్థాలు చేరకుండా ఆచరణాత్మక పరిష్కారాలు అవసరం.

రూ.330 కోట్లతో డ్రెయిన్ల అనుసంధానం, వ్యర్థ జలాల శుద్ధి ప్రాజెక్టు తీసుకురానున్నాము.

ప్రజల ప్రవర్తనలో మార్పు లేకుండా సముద్ర కాలుష్యానికి శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు

విశాఖపట్నం: సముద్ర కాలుష్యాన్ని అరికట్టాలంటే సముద్ర తీరాలను శుభ్రం చేయడంతో పాటు నగరంలోని డ్రెయిన్ల వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయడం అత్యంత కీలకమని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. కేంద్రప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిర్మల్ సాగర్’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి డాక్టర్ టి.శ్రీనివాస్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు...స్వఛ్చ సాగర్ సురక్షిత సాగర్ లక్ష్యంగా సభలో వారితో ప్రతిజ్ఞ చేయించారు....ఈ సందర్భంగా ఎం.పి శ్రీభరత్ మాట్లాడుతూ గాజువాక నుంచి భీమిలి వరకు సుమారు 40 చిన్న, పెద్ద డ్రెయిన్లు ఉన్నాయని, వర్షపు నీటిని సముద్రంలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఈ డ్రెయిన్లు ప్రస్తుతం ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఇతర చెత్తతో కలుషితమవుతున్నాయని శ్రీభరత్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో బెడ్లు, పరుపులు, కుర్చీలు వంటి పెద్ద వస్తువులను కూడా డ్రెయిన్లలో పడేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.330 కోట్లతో సమగ్ర డ్రెయిన్ ప్రాజెక్టు
విశాఖపట్నంలో సుమారు 18 ప్రధాన డ్రెయిన్లను అనుసంధానిస్తూ రూ.330 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. డ్రెయిన్ల ద్వారా భౌతిక వ్యర్థాలు సముద్రంలోకి చేరకుండా రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, చివరి దశలో వ్యర్థ జలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ETPs) ద్వారా శుద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని వివరించారు.
శుద్ధి చేసిన నీటిని అవసరాన్ని బట్టి సముద్రంలోకి విడుదల చేయడం లేదా ఉద్యానవనాలు, హార్టికల్చర్ వంటి ఇతర అవసరాలకు వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు.
సాంకేతిక పరిష్కారాలతో డ్రెయిన్లపై దృష్టి
డ్రెయిన్లలో వ్యర్థాలు సముద్రంలోకి చేరకుండా శాశ్వత పరిష్కారాలను రూపొందించాల్సిన అవసరం ఉందని శ్రీభరత్ అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రెయిన్లను కప్పివేయడం, నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించే ప్రత్యేక పోరస్ కవర్లు లేదా ఇతర సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే అంశంపై నిపుణులు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు దృష్టి సారించాలని కోరారు.
అదేవిధంగా, డ్రెయిన్లలో వివిధ ప్రాంతాల్లో నెట్‌వర్క్ బ్యారియర్లు ఏర్పాటు చేసి, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు వస్తున్నాయో గుర్తించి మూల కారణాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత పరిష్కారం
వారాంతాల్లో సముద్ర తీరాలను శుభ్రం చేయడం ద్వారా తాత్కాలికంగా ప్రయోజనం కలిగినా, వ్యర్థాలు సముద్రంలోకి చేరకుండా నిరోధించడమే అసలైన పరిష్కారమని ఎంపీ స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు ఎంతటి నిధులు ఖర్చు చేసినా ప్రజల ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆశించిన ఫలితాలు సాధ్యం కావని అన్నారు. పౌరులు కేవలం సమస్యలపై ఫిర్యాదులు చేయడమే కాకుండా, వ్యర్థాలను బాధ్యతగా నిర్వహించడం, డ్రెయిన్లలో చెత్త వేయకపోవడం వంటి అంశాల్లో స్వయంగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
భూగర్భ జలాల పరిరక్షణపై దృష్టి
అక్రమ బోర్‌వెల్స్ ఏర్పాటు, భూగర్భ జలాల అధిక వినియోగం వంటి అంశాలపై కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీభరత్ అన్నారు. భూగర్భ జలాల మట్టాలు పడిపోతే సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని, ఇది భవిష్యత్తులో నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
విశాఖను అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దాలి
ఆస్ట్రేలియాలోని పెర్త్ వంటి నగరాల తరహాలో విశాఖపట్నాన్ని పరిశుభ్రమైన, పర్యావరణహితమైన, సుందరమైన అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ అన్నారు.
ఈ దిశగా కేంద్ర పృథ్వీ విజ్ఞాన మంత్రిత్వ శాఖ నుంచి విశాఖకు అవసరమైన సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వం, నిధులు అందించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీవీఎంసీతో పాటు నిపుణులు, పౌర సమాజం, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే విశాఖను సముద్ర స్వచ్ఛతకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని శ్రీభరత్ పేర్కొన్నారు.
సముద్రాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో 
కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరావు,
ఆంధ్ర విశ్వవిద్యాలయంవైస్-ఛాన్సలర్, 
ప్రొఫెసర్ జి. పి. రాజా శేఖర్,
INCOIS డైరెక్టర్ డా. ఎ.ఎస్. టి.ఎం. బాలకృష్ణన్ నాయర్,, 
తూర్పు నావికా దళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పి & ఎ) రియర్ అడ్మిరల్ గోకుల్ కృష్ణ దత్తా, VSM 
ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ 
ఐజీ అనురాగ్ కౌశిక్, విబ్నా కార్యదర్శి
శ్రీ పి. ఎ. వివేకానంద పై తదితరులు పాల్గొన్నారు..

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

విశ్వనగర్ నూతన బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నంద్యాల చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ నంద్యాల’

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

గుత్తి పట్టణం నందు మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

🕑 19 Sep 2026
Advertisement
↗ Full Article ← Home