జగనన్న సంక్షేమం వివరిస్తూ.. కూటమి పాలనను ఎండగట్టండి
వైసీపీ శ్రేణులకు ఎర్రకోట పిలుపు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ అలాగే జగనన్న అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ 24 నెలల కూటమిపాలన అవలంబిస్తున్న వైఖరిని ఎండగడుతూ ప్రతి నాయకుడు కార్యకర్త ముందుకు సాగాలని వైకాపా ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపల్ పై వైకాపా జెండా ఎగరవేయాలి అన్నారు. 44 వార్డులో కట్టుదిట్టంగా ఉండే నాయకులు ఎన్నికల బరిలోకి దించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకారం అందిస్తూ గెలుపు దిశగా పయనించాలన్నారు. ప్రతి వార్డులో కూడా తాను ప్రచార నిమిత్తం తిరగడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి బిఆర్ బసిరెడ్డి వైకాపా సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.