ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం
ఆదోని టౌన్, సూర్య ప్రతినిధి :
ఆదోని పట్టణం ఇంద్రనగర్ ఉప్పర వీధిలో గల్లిక గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో గణేష్ స్వామివారి 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఇంద్రనగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. డాక్టర్ పద్మకుమార్, కర్నూలు జిల్లా సగర సంఘం అధ్యక్షులు గోనభావి గోపాల్, మంత్రాలయం సగర సంఘం అధ్యక్షులు కల్లుకుంట రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని గణేశుడిని ప్రార్థించారు.