☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం
ఆంధ్రప్రదేశ్

ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం

17 Sep 2026 Reporter

తిరుమల మేజర్ న్యూస్,

తిరుమలకు చేరుకున్న ఏపీ గవర్నర్.

తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని శ్రీ భాగ్య అతిథి గృహం వద్ద గవర్నర్కు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ,సివిఎస్వో మురళీకృష్ణాలు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అతిథి గృహంలో గవర్నర్ తో టిటిడి చైర్మన్ ,ఈవో, సివిఎస్వో లు తిరుమల లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తులకు చేస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లు పై వివరించారు. కాగా రాత్రి ఆయన వాహన సేవలో పాల్గొని శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home