☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి
ఆంధ్రప్రదేశ్

కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి

18 Sep 2026 Reporter

కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి.. రైతులకు న్యాయం చేయాలిఅని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం బాధాకరం అని ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం అందించాలి. పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం వెంటనే చెల్లించాలి. రైతన్నకు హామీలు కాదు.. తక్షణ ఆర్థిక సాయం కావాలి. కరువు వేళ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతుల పక్షాన నిలబడాలి అని ఆయన తెలిపారు.

 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home