పాత వంతెన శితిలాలపై దొంగలు పడ్డారు
లూటి అవుతున్న ఇనుపకడ్డీలు
.. అధికార పార్టీ హస్తం..?
.. అధికాలు కేసులు పెట్టిన పట్టించుకోరు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
2009 తుంగభద్రా నదికి సంభవించిన వరదల కారణంగా అప్పటికే నిర్మితమైన నాగల్దిన వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది.. ఆ శిథిరాలపై అధికార పార్టీ నేతలకు కన్ను పడిందా.. అంటే అవుననే సమాధానం వస్తుంది.. దాదాపు 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వంతెన శిథిరాలపై దొంగలు పడ్డారు ఇనుప కడ్డీలను దోచుకు వెళ్తున్నారు.. లక్షల రూపాయల ఆదాయాన్ని మూట కట్టుకుంటున్నారు.. తెర వెనుక ఎవరున్నారు ఆ దొంగల భరతం పట్టేది ఎవరో అని ఇప్పటివరకు నేషనల్ హైవే అధికారులకు అంతు పట్టడం లేదు.. కేసు పెట్టిన నందవరం పోలీసులు పట్టించుకోవడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది.. వేల టన్నుల ఇనప కడ్డీని దొంగలు బ్లాస్టింగ్ చేసి తీసుకు వెళ్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ డి ఈ వెంకటేశ్వర్లు నందవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అక్కడ పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నది తేటతెర్లమవుతుంది. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఎవరు పట్టించుకోరా అని నది తీర గ్రామాల ప్రజలు నీవేరపోతున్నారు. 1993 ఏడాదిలోఏడున్నర కోట్లు బ్రిడ్జిని అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిధులు కేటాయించి నిర్మిస్తే నేడు ఆ శిథిలాలపై దొంగలు పడ్డ అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఇనుప గడ్డి మాయం అవుతుంటే చూస్తూ ఎందుకు కోరుకున్నారో అంత పట్టడం లేదు. సమీపంలోనే బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర నందవరం పోలీసులు కాపలా ఉన్నప్పటికీ ఇంత పెద్ద దొంగతనం జరుగుతున్న చూసి చూడనట్టు ఎందుకు ఉన్నారో అంత పట్టడం లేదన్నది ప్రధాన వాదన.. ఇప్పటికైనా పోలీసు అధికారులు హైవే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటారో లేదో వేచి చూద్దాం..