-ఛాతీ క్యాన్సర్ శస్త్ర చికిత్సలో కొత్త యుగం
-క్యాన్సర్ తో పాటు రోగి జీవితాన్ని మెరుగుపర్చడమే ఆధునిక చికిత్స లక్ష్యం
-సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డా.రాజేష్ గౌడ్
నంద్యాల, మేజర్ న్యూస్ బ్యూరో: సమాజంలో
మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య సేవల్లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయని ప్లోరోసెన్స్ గైడెడ్, రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డా. రాజేష్ గౌడ్ అన్నారు. గురువారం నంద్యాలలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ చికిత్స లోని ఆధునిక చికిత్స విధానాలను వెల్లడించారు. గతంలో రోగులు ఎదైనా ఆపరేషన్స్ చేయించుకుంటే చాలా రోజులు ఆసుపత్రిలోనే వైద్యం తీసుకునే వారన్నారు. ఆధునిక వైద్య సేవల్లో రోగి త్వరగా కోలు కొని వారం లోపు ఇంటికి వెళ్లే విధంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గత దశాబ్ధా కాలంగా క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. ట్యూమర్ బయాలజీపై మెరుగైన అవగాహన పెరగడంతో నేటి క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా రోగికి మంచి జీవన నాణ్యతను అందిస్తూ పూర్తి నయం చేయడం ఈ మార్పులో అత్యంత ముఖ్యమైనదన్నారు. హై-డెఫినిషన్ 3డి విజన్, ట్రెమర్ ఫీ ఇన్స్ట్రుమెంట్స్ మనిషి చేతి కదలికలను అనుసకరించే యంత్రాల ద్వారా క్లిష్టమైన శస్త్ర చికి న్నారు. మహిళల క్యాన్సర్లలో ముఖ్యంగా గర్భశయ మరియు అండాశయ క్యాన్సర్లలో రోబోటిక్ శస్త్ర ఇస్తుందన్నారు. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీ కొత్త దిశను చూపుతోందన్నారు. ప్రత్యేకమైన డ్రై ఇంజ క్షన్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ మొదటి ప్రభావితమయ్యే సెంటినెల్ లింఫ్ నోడ్స్ ప్రత్యేక కెమెరా ద్వారా స్పష్టంగా కనిపిస్తాయన్నారు. ప్లోస్టేట్, బ్లాడర్, కిడ్నీ మరియు అడ్రినల్ ట్యూమర్ల చికిత్సలో రోబోటిక్ టెక్నాలజీ పెద్ద మార్పు తీసుకొచ్చిందన్నారు. ఛాతి శస్త్ర చికిత్సలలో ఇప్పుడు పెద్ద కోతలు వేసే రోజులు పోయాయన్నారు. పైర్లిప్ టెక్నాలజీ క్యాన్సర్ను వెలుగులో చూపించే సాంకేతికత అన్నారు. ప్రత్యేక డై ఇంజెక్షన్తో క్యాన్సర్ టిష్యూటలు లేదా లింఫాటిక్ మార్గాలు గ్లో అవ్వడం వాటిని మరింత స్పష్టంగా గుర్తించ్చన్నారు. రోబోటిక్ మరియు ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలు క్యాన్సర్ శస్త్ర చికిత్సలను కేవలం వ్యాధి నివారణకే పరిమితం కాలేదన్నారు. రోగి జీవన నాణ్యతను కాపాడే దిశగా ముందుకు తీసుకెళ్తున్నా యన్నారు. క్యాన్సర్ను నయం చేయడమే కాదని, రోగి జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చడం ఆధునిక శస్త్రచికిత్సల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.