ప్రజల కోసం పనిచేసే ప్రజా నేత ఇరిగినేని
- ఇరిగినేని తిరుపతి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులు
- మోపాడు ఘాట్, బొట్లగూడూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్‌రావు
పామూరు, మేజర్ న్యూస్ :
కనిగిరి మాజీ ఎమ్మెల్యే, దివంగత ఇరిగినేని తిరుపతి నాయుడు 88 జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్‌రావు మోపాడు గ్రామంలోని ఇరిగినేని తిరుపతి నాయుడు ఘాట్‌పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొట్లగూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇరిగినేని తిరుపతి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగినేని తిరుపతి నాయుడు రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసిన ఇరిగినేని తిరుపతి నాయుడు ఆశయాలు, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఇరిగినేని రవీంద్రబాబు,పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, యారవ శ్రీనివాసులు,పువ్వాడి వెంకటేశ్వర్లు (బిల్డర్), పువ్వాడి రామారావు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, ఉప్పుగండ్ల రమేష్, మార్నేని రామకృష్ణ, మల్లెబోయిన బాల బ్రహ్మయ్య యాదవ్, తెల్లజాల ప్రసాద్, గుర్రం వెంకటేశ్వర్లు, దారపనేని సుబ్బారావు, కోటపాటి నరసింహారావు, ఏలూరి మాధవరావు, దయిండే శివశంకర్, షేక్ గౌస్ బాషా, మోరుబోయిన నరసింహారావు, ఆరెకొండ హరిప్రసాద్, మెడ బలిమి వెంకట్రావు, వింజం కొండయ్య తదితరులు పాల్గొన్నారు.