☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ తెలుగు గజల్ గాన విభావరి
ఆంధ్రప్రదేశ్

తెలుగు గజల్ గాన విభావరి

20 Sep 2026 vizagsrinivas

 

 

విశాఖ కల్చరల్,  సెప్టెంబర్ 20,మేజర్ న్యూస్:


విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి సంవత్సరం పొడుగునా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి కళకి పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నది. ఈ రోజు, చల్లని ఆదివారం సాయింత్రం న ప్రముఖ వర్ధమాన గజల్ గాయని కుమారి 'సంస్కృతి' తెలుగు గజల్ కార్యక్రమం నిర్వహించారు .

కార్యక్రమానికి ముందుగా సభాధ్యక్షులు  మంతెన సత్యనారాయణ రాజు, కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్, ట్రస్టీ శ్రీ రామ్ గోపాల్,  ఆచార్య వి.బాలమోహన దాస్ , శ్రీమతి  యార్లగడ్డ  శోభా లక్ష్మి  ప్రసాద్, డా.కె.జి.వేణు, నరసింగరావు, సంస్కృతి జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు.

కళాభారతి అధ్యక్షులు యం.యస్.యన్. రాజు మాట్లాడుతూ కళలని పోషించడం, ప్రోత్సహించడం ప్రాచుర్యంలోకి తేవడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని కళాభారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వేసి వర్ధమాన కళాకారిణి, గజల్ శ్రీనివాస్ కుమార్తె   "కుమారి సంస్కృతి" గజల్ గానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కళాభారతి ఎల్లప్పుడూ కోరుకునేది ఇప్పటి తరం వారు కళల పట్ల ఆసక్తి చూపించి ముందుకు రావాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని కోరుకునే మాకు ఈ వర్ధమాన కళాకారిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
కుమారి 'సంస్కృతి' గజల్ విశేషాలు చెబుతు ఆరవ శతాబ్దంలో పర్షియాన్ భాష లో పుట్టిన గజల్ కళ మన తెలుగు భాషలో డాక్టర్ దాశరథి,  డా.సినారె విస్తరించగ గజల్ శ్రీనివాస్ ప్రాచుర్యంలోకి తెచ్చారు.
తర్వాత జరిగిన గజల్ గాత్ర కార్యక్రమంలో ముందుగా శ్రీ  శ్రీనివాసం లోని "ఎన్ని ఎన్ని విన్నపాలో" అనే భక్తి గీతం, వి నరసారెడ్డి గారి రచన సారంగి రాగంలో భక్తిగా గానం చేసి, తరువాత ప్రముఖ రచయిత జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన గజల్ "మంచు పొగలుండేవి" దేశీరాగం లో
తర్వాత "పదిలం పదిలం " అంటూ తల్లీదండ్రుల చిన్ననాటి జోల పాటల గురుతులపై ఎంతో చక్కటి హావభావాలతో రాగాలాపనతో ఆలపించి ప్రతి ఒక్కరి కరతాళ ధ్వనులను అందుకున్నది చిన్నారి సంస్కృతి. 
తరువాత యవన్ కళ్యాణి రాగాంలో "సుఖమైన దుఖఃమైన" అనే గజల్ ను,

తర్వాత అంశంగా "మనసు లోనే పిలిచి" అంటూ ఆ దేవదేవుడినే సాక్షాత్కరింపజేసిన ఈ  కళాకారిణి చాలా అభినందనీయురాలు.

తరువాత డాక్టర్ వెంకటేశ్వరరావు రచించిన "చేదుకుంటే బావినీరు" కన్నడ రాగంలో గానం చేసి శ్రోతల మన్ననలను అందుకుంది.

తరువాత "నమ్మదగిన మనిషి" అంటూ మనిషి తత్వాన్ని ఆవిష్కరింపజేసింది తన గజల్ గానం ద్వారా.

చివరిగా "పాపికొండలు" అంటూ తూర్పుగోదావరి జిల్లా యాసలో బహు శ్రావ్యంగా గానం చేసి శభాష్ అనిపించుకుంది. ప్రతి గజల్ ను ఆహూతులందరు చక్కని కరతళ ధ్వనులతో అలరించారు.

చివరిగా అందరూ ప్రసాదాలు ఆరగించి ఆనందంగా ఆహ్లాదంగా ఇళ్ళకి వెళ్లారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home