భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో సాధారణ కుటుంబంలో జన్మించి, ఆరెస్సెస్ ప్రచారక్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం దేశ అత్యున్నత పదవి వరకు ఎలా సాగిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
రిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వాద్‌నగర్ ప్రాంతంలో 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీ.. చిన్ననాటి నుంచే ప్రజా సేవ వైపు ఆకర్షితులయ్యారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
తొలినాళ్లలో ఆరెస్సెస్ (RSS) కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, 1971లో అధికారికంగా ఆరెస్సెస్ ప్రచారక్‌గా తన పూర్తి స్థాయి రాజకీయ, సామాజిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన, పార్టీ సంస్థాగత బలోపేతం కోసం వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో బీజేపీలో క్రియాశీలక సభ్యుడిగా బాధ్యతలు చేపట్టి, పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 2001 నుంచి 2014 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్ సీఎంగా ఆయన అమలు చేసిన అభివృద్ధి మరియు సంస్కరణల నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అఖండ విజయం వైపు నడిపించిన ఆయన, తొలిసారిగా దేశ 14వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి దేశ పగ్గాలు చేపట్టిన మోదీ, పాలనా రంగంలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ఆదరాభిమానాలతో వరుసగా మూడోసారి కూడా దేశ ప్రధానిగా పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. తనదైన ప్రత్యేక పాలనా శైలి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా శక్తివంతమైన ప్రపంచ నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణ ప్రచారక్ స్థాయి నుంచి దేశ సర్వోన్నత పదవిని అధిరోహించి గ్లోబల్ లీడర్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం భారత రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.