|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:29 PM
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా విలాతికుళం పరిధిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెతకగా, సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలికపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో, నిందితులు బాలికను చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Latest News