|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:26 PM
మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 50 మందికి పైగా మహిళా సిబ్బంది ఉన్న కార్యాలయాల్లో తప్పనిసరిగా చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం పింక్ టాయిలెట్లు, షీ క్యాబ్స్ సేవలను మరింత విస్తృతం చేయనున్నారు. దీనికి తోడు రూ.172 కోట్ల వ్యయంతో 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఒక్క విశాఖపట్నంలోనే మూడు హాస్టళ్లను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి లక్ష పట్టణ జనాభాకు కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Latest News