|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:11 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధము జరుగుతున్నప్పటికీ, ప్రపంచం చమురు లోటుతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇరాన్ తన ఆర్థిక మూలాలను కాపాడుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది అనే చెప్పవచ్చు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ సుమారు 11.7 మిలియన్ బారెళ్ల ముడి చమురును హర్మూజ్ జలసంధి ద్వారా చైనాకు విజయవంతంగా తరలించింది. అంతర్జాతీయంగా అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను ధిక్కరిస్తూ ఇరాన్ ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం గమనార్హం.ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉండటం దానికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా లతో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, తన నౌకల ద్వారా చైనాకు నిరంతరాయంగా చమురును సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఇరాన్ చమురును అందిస్తుండటంతో చైనా తన ఇంధన అవసరాల కోసం ఆ దేశంతో వాణిజ్యాన్ని మరింత పెంచుకుంది.
Latest News