తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు స్థానిక అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.డి. కైరున్నిసా, పంచాయతీ కార్యదర్శి నాగ లక్ష్మీ, వార్డ్ మెంబర్స్ వెంకన్న, రాజు, అంగన్వాడి టీచర్స్ రజిత, విజయలక్ష్మి, ఏఎన్ఎమ్ యశోద, ఆశ వర్కర్ సావిత్రి, గర్భవతులు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ