☼ Suryaa News
🔴 తెలంగాణ ప్రజాసేవే దామోదర్ రెడ్డి ఆశయం, మానవతా సేవే దామన్నకు నిజమైన నివాళి:- చెవిటి వెంకన్న యాదవ్
తెలంగాణ

ప్రజాసేవే దామోదర్ రెడ్డి ఆశయం, మానవతా సేవే దామన్నకు నిజమైన నివాళి:- చెవిటి వెంకన్న యాదవ్

14 Sep 2026 Reporter

తిరుమలగిరి మేజర్ న్యూస్ :-దివంగత నేత , మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి  74వ జయంతి వేడుకలను  దామన్న అభిమాన సంఘం మండల అధ్యక్షులు రాపాక సోమేశ్  ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా  మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్  దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా చెవిటి  వెంకన్న యాదవ్  మాట్లాడుతూ ప్రజల కోసం జీవించడం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించడమే దామోదర్ రెడ్డి  జీవిత ఆశయమని అన్నారు. సూర్యాపేట అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజం కోసం తమ వంతు బాధ్యతగా మానవతా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య,  మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేల్సోజు నరేష్,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్ర యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట బిక్షం రెడ్డి, ధూపాటి మల్లయ్య, మహమ్మద్ కలీం పాషా,  కేషిడి రవీందర్ రెడ్డి,   సర్పంచులు , కౌన్సిలర్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home