☼ Suryaa News
🔴 తెలంగాణ లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం ప్రభాకర్,ఆకుల నరసన్న పటేల్
తెలంగాణ

లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం ప్రభాకర్,ఆకుల నరసన్న పటేల్

15 Sep 2026 Reporter

సూర్య కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్ కట్టరాంపూర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, ముదిరాజ్ సంఘం నేత పిట్టల లింగయ్య ముదిరాజ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా, కరీంనగర్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home