☼ Suryaa News
🔴 తెలంగాణ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య…
తెలంగాణ

వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య…

17 Sep 2026 Reporter
 సూర్య కోరుట్ల: నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో కోరుట్లకు చెందిన హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం మేరకు కారులో వచ్చిన పలువురు వ్యక్తులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తులతో హరిబాబుపై దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఐదు నెలల క్రితం తన భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నాడని, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది. బెయిల్‌పై విడుదలైన కొద్దికాలానికే అతడు హత్యకు గురికావడం కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తూ, వారి కోసం గాలింపు చేపట్టారు.
Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home