☼ Suryaa News
🔴 తెలంగాణ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తెలంగాణ

ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

14 Sep 2026 Reporter

 

కుల్కచర్ల,మేజర్ న్యూస్: మండల కేంద్రంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయకునికి పుష్పాలు, పత్రాలతో అలంకరణ చేసి నైవేద్యాలు సమర్పించారు. విఘ్నాలు తొలగించి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home