☼ Suryaa News
🔴 తెలంగాణ ఆడపిల్ల జన్మిస్తే రూ.5,016 నగదు ప్రోత్సాహకం…. మాట నిలబెట్టుకున్న సర్పంచ్ పొన్నాల సంపత్…
తెలంగాణ

ఆడపిల్ల జన్మిస్తే రూ.5,016 నగదు ప్రోత్సాహకం…. మాట నిలబెట్టుకున్న సర్పంచ్ పొన్నాల సంపత్…

15 Sep 2026 Reporter
01 సూర్య కరీంనగర్ ప్రతినిధి:ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహాత్మనగర్ ప్రజలకు ఇచ్చిన మాటను సర్పంచ్ పొన్నాల సంపత్ నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించిన కుటుంబానికి రూ.5,016 నగదు ప్రోత్సాహకంగా అందజేస్తానని గతంలో ప్రకటించిన ఆయన.. తాజాగా ఓ కుటుంబానికి ఆ మొత్తాన్ని అందజేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్‌కు చెందిన ఎండీ నజీర్ చిన్న కుమారుడు నౌమాన్–రిహాన దంపతులకు ఆడపిల్ల జన్మించడంతో సర్పంచ్ పొన్నాల సంపత్ వారి కుటుంబాన్ని అభినందించి, రూ.5,016 నగదును అందజేశారు. ఆడపిల్లల జననాన్ని స్వాగతిస్తూ, వారి భవిష్యత్తుకు అండగా నిలవాలనే సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన చాటిచెప్పారు.“ఆడపిల్లను ప్రోత్సహిద్దాం.. ఆడపిల్లల భవిష్యత్తుకు అండగా నిలుద్దాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు.
Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home