☼ Suryaa News
🔴 తెలంగాణ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ
తెలంగాణ

పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ

15 Sep 2026 Reporter

సూర్య ఎండపల్లి :

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సోమవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, పిల్లల చదువుకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి కుటుంబమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో స్పందించి అండగా నిలిచినందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ ,ఎండపెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లు శేఖర్,వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి, ఏం సి  డైరెక్టర్ ద్యావా మహిపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home